ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం గం గణపతయే నమః
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
భగవాన్ ఉవాచ
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ । స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।।గీత 3- 35 ।।
ఇతరుల ధర్మాన్ని చక్కగా ఆచరించటం కన్నా, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల ధర్మాన్ని అనుసరించటం ప్రమాదకరమైనది.
ధర్మనిధి ఆశయములు
- భగవద్గీత, రామాయణము, మహా భారతము, భాగవతము, ఉపనిషత్తులు, వేదముల ప్రచారము
- దేవాలయములు పరిరక్షణ.
- గో సంరక్షణ
- ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సమాజ సేవ.
- ప్రచార రథములో గ్రామ గ్రామమునకు వెళ్లి ధర్మ చైతన్యమును కలిగించడము.
- మత మార్పిళ్ల ను అరికట్టడము.
- ప్రతి ఆది వారము విద్యార్థులకు ఆధ్యాత్మిక, శారీరక శిక్షణా కార్యక్రమము జరిపించడము.
